తెలంగాణలో ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు దుస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే బాధ్యత : ఎంపి అర్వింద్
- తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే ముందుగా రైతులకు ఏకారకు రూ 50 వేలు అందించాలి : ఎంపీ అర్వింద్
సాగునీరు, జలవనరుల నిర్వహణపై ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించి ఉంటే, ఎల్‌నినో ప్రభావం సహా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రం మరింత మెరుగ్గా సిద్ధమయ్యేదని అర్వింద్ అన్నారు. తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే ముందుగా రౌతులకు ఏకారకు రూ 50 వేలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులను కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయని అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు చర్చలు జరుగుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అడ్డుగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ద్వారా రేవంత్ రెడ్డిని రాజకీయంగా పక్కన పెట్టాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగె
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని అర్వింద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యాసంగి సీజన్‌లో వరి సాగును నిరుత్సాహపరిచే ప్రతిపాదనపై స్పందిస్తూ.. రైతులు తమ భూములను బీడుగా వదిలేయాలని కోరే ముందు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు క్వింటాల్ వరికి రూ.50 వేల ధర లభించేలా చూస్తామని అర్వింద్ పేర్కొన్నారు. ఈ హామీని స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణం పూర్తికావడంలో జరుగుతున్న జాప్యంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు త్వరలో భారీ ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఎంపీ ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచుతానని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న, భారత్ రెడ్డి, పొతన్ కార్ లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్, ప్రమోద్ కుమార్, జ్యోతి, బంటు రాము, నక్క రాజేశ్వర్, బద్దం కిషన్ తడితరులు పాల్గొన్నారు.
