- నిజామాబాద్ జిల్లా ఖో-ఖో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 22: జిల్లాలో ఖో-ఖో క్రీడాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని అసోసియేషన్ నూతన అధ్యక్షుడు జీవి భూమా రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీసాల సుజాత తెలిపారు. గురువారం నిజామాబాద్‌లోని టీఎన్జీవోస్ భవన్లో నిజామాబాద్ జిల్లా ఖో-ఖో నూతన అసోసియేషన్ ఎన్నికలు వివిధ మండల ఖో-ఖో అసోసియేషన్ల ప్రతినిధుల సమక్షంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఖో-ఖో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, న్యాయవాది ఎస్. చరణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. నూతన కార్యవర్గం వివరాలు- అధ్యక్షుడిగా జీవి భూమా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి మీసాల సుజాత, కోశాధికారిగా ఎస్. గంగారెడ్డి-, ఉపాధ్యక్షులుగా ఎస్. నాగేశ్వరరావు, గోపి శోభ, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా జి. వెంకటేశ్వరరావు, సీహెచ్. నరసింహులు, రాజా గౌడ్, సీహెచ్. రాము, కార్యవర్గ సభ్యులు (ఈసీ మెంబర్లు): శ్రీనివాస్, సురేష్, కీర్తి, సంతోషి, ఎం.సి. శ్రీను, సుధాకర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి ఎస్. చరణ్ కుమార్ పర్యవేక్షించారు. తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ తరఫున శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున బొబ్బిలి నర్సయ్య, జిల్లా యువజన క్రీడల శాఖ తరఫున పవన్ కుమార్ పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ఖో-ఖో క్రీడను మరింత విస్తరించి, యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, జిల్లాస్థాయి పోటీలను సమర్థవంతంగా నిర్వహించడం, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాకారులు రాణించేలా కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer