📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ఏం బి బి ఎస్ సాదించిన విద్యార్థికి సన్మానం

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఏం బి బి ఎస్ సాదించిన విద్యార్థికి సన్మానం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రూప్ నాయక్ తండాకు చెందిన అజ్మిరా వెన్నల ను గ్రామస్తులు గణంగా సన్మానించారు. శుక్రవారం రోజున గ్రామంలోని ఆమె ఇంటివద్ద గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి యువనాయకులు సాయికిరణ్ అద్వర్యంలో అజ్మిరా వెన్నెలను శాలువాతో గణంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వెన్నెల కు తండ్రి చిన్నతనంలోనే మరణించిన అమ్మ కూలి పని చేస్తూ వున్నా తల్లి మేనమామ కుటుంబం ప్రోత్బలంతో మంచి గట్టి పట్టుదలతో కష్టపడి చదివి ఏం బి బి ఎస్ సీటు సాదించడం మా గ్రామానికే గర్వకారణం అని అయన అన్నారు. ఈమె విజయం చాలామంది విద్యార్థులకు స్ఫూర్తి అని కస్టపడి చదివితే ఏదైనా సాదించవచ్చు అని వెన్నెల చుపించందని అయన అన్నారు. రాబోయే రోజులలో వెన్నల మంచి ఉన్నతమైన వైద్యురాలు అయి ఆమె తల్లితండ్రులకు కుటుంబ సబ్యులకు గ్రామానికి మంచిపేరు ప్రతిష్టలు తేవాలని ఆశిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ సందర్బంగా అందరు ఆమెను అబినందించారు.