జాతీయ స్థాయిలో సత్తా చాటిన భారతీనగర్ క్రీడాకారులు
- పతక విజేతలకు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అభినందనలు
- 95 ఏళ్ల వయస్సులోనూ బంగారు పతకం సాధించిన వెంకట్ రామయ్య.. క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం
పతక విజేతల వివరాలు
వెంకట్ రామయ్య (95 సంవత్సరాలు): హామర్ త్రోలో బంగారు పతకం.
శామ్యూల్ (85 సంవత్సరాలు): హామర్ త్రోలో రజత పతకం.
దేవేంద్రా చారి: హామర్ త్రోలో కాంస్య పతకం.
బలయ్య: డిస్కస్ త్రోలో కాంస్య పతకం.
పాటి సత్యనారాయణ: వాకింగ్ విభాగంలో కాంస్య పతకం.
సంధ్య (45 సంవత్సరాలు): షాట్‌పుట్‌లో కాంస్య పతకం.
అదేవిధంగా సీహెచ్ రాములు, స్వర్ణ, బలరాజ్, సరిత తదితరులు ఇతర అథ్లెటిక్స్ విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వెన్నవరం ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, 95 సంవత్సరాల వయస్సులోనూ వెంకట్ రామయ్య హామర్ త్రోలో బంగారు పతకం సాధించడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ వయస్సులోనైనా విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారతీనగర్ డివిజన్‌కు మంచి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
