అంగన్‌వాడీ టీచర్లకు దసరా కానుకలు అందజేసిన బూరుగడ్డ పుష్పనగేష్
- అంగన్‌వాడీ టీచర్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ కార్పొరేటర్
రామచంద్రపురం: విజయదశమి పండుగను పురస్కరించుకుని రామచంద్రపురం డివిజన్‌లో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ దసరా చిరుకానుకలు అందజేశారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో ఉన్న తన నివాసంలో అంగన్‌వాడీ టీచర్లకు బహుమతులు ప్రదానం చేసి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు చిన్నారుల సంరక్షణ, పోషకాహారం, మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం అందిస్తున్న సేవలను అభినందించారు. పండుగ సందర్భంగా వారితో సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో కానుకలు అందజేసినట్లు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ, వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
