బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
- నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు చేసి , కేసు విచారణలో కీలకంగా కృషి చేసిన పోలీసు అధికారులు , సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య ఐపీ ఎస్
బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాధ్ తీర్పు వెలువరించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే 2021 సెప్టెంబర్‌లో నిజామాబాద్‌లోని ఓ ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై నిందితుడు మాచా రవీంద్రనాథ్ అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైం నంబర్ 236/2021గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 354-D కింద నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా, అలాగే POCSO చట్టంలోని సెక్షన్ 9 కింద 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ గౌరవనీయ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి , కేసు విచారణలో కీలకంగా కృషి చేసిన పోలీసు అధికారులు , సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య ఐపీ ఎస్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు , బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని , బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని సీపీ తెలియజేశారు.
