📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

గోలేటి టౌన్ షిప్ లో పారిశుద్ధ్య కమిటీ పర్యటన.

◉ M VIJAYA   |   ◷ Latest
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ ఆదేశాల మేరకు సింగరేణి పారిశుద్ధ్య కమిటీ సభ్యులు శుక్రవారం గోలేటి టౌన్ షిప్ లోని సింగరేణి కాలనీల్లో పర్యటించారు.సింగరేణి సంబంధిత చెత్త కుండీలను, రోడ్డుకు ఇరువైపులా స్వచ్ఛత పనులు పరిశీలించారు.ఎస్సీసీఎల్ పరిధిలోని పలు ప్రదేశాల్లో గోలేటికి చెందిన సింగరేణేతరులు చెత్తను నిర్లక్ష్యంగా పడేస్తున్నట్లు గుర్తించారు.సింగరేణి పారిశుద్ధ్య నిర్వహణ గుత్తేదారుకు కాలనీలోని రహదారులకు ఇరువైపులా చెత్త తొలగించడంతో పాటు ప్రత్యేకంగా సింగరేణి కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు అప్పగించడం జరిగిందన్నారు.నిబందనల ప్రకారం వారు పనులు చేస్తున్నారని,సింగరేణేతరులు సింగరేణి ఉద్యోగుల నివాసాల సమీపంలో చెత్త పడేయకుండా వాటి నిర్వహణ గ్రామ పంచాయతి అధికారులు చూసుకోవాలని పంచాయతి పాలక వర్గం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.సింగరేణి ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు,ఎస్ఓ టు జిఎం స్వామి రాజు,ఎస్ ఈ సివిల్ శ్రీధర్,ఏఈ సివిల్ క్రాంతి సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.