📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సిద్ధం.....

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సిద్ధం.....
  • విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్‌తో పాటు గజ ఈతగాళ్లు ఏర్పాటు. ఆలయం వద్ద నిర్వహించే శమీ పూజ, రావణ దహన కార్యక్రమాలకు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిలకించేందుకు బారికేడ్లు ఏర్పాటు. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాట్లు.
నిర్మల్ అక్టోబర్ 18(సాక్షర ప్రతినిధి)
దసరా, బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
వినాయక్ సాగర్, మహాలక్ష్మి ఆలయ పరిసరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ........ దసరా పండుగ సందర్భంగా వినాయక్ సాగర్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్‌తో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించే శమీ పూజ, రావణ దహన కార్యక్రమాలను ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిలకించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశామని, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను అమర్చినట్లు వివరించారు.
దసరా రోజున మహాలక్ష్మి ఆలయానికి వచ్చే భక్తులు, ప్రజలు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కాలినడకన, ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు గాంధీ చౌక్, విశ్వనాథ్‌పేట్ మార్గం ద్వారా రావాలని, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోల్లో వచ్చే వారు కలెక్టరేట్ మార్గం ద్వారా రావాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పట్టణ ప్రజలందరూ దసరా, బతుకమ్మ పండుగలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెండం శ్రీనివాస్, శ్రీరామోజీ నరేష్, గుంజాల లక్ష్మి చైతన్య, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ల రాజు, మాజీ చైర్మన్ కుడుకల గంగాధర్ మరియు విశ్వ హిందూ పరిషద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.