అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
- సర్కిల్ పరిధిలోని ప్రజా సమస్యలను వివరించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి
అనంతరం సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీలు, ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, మెంబర్ లక్ష్మీకాంత్ రావు, అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, మహేష్ గౌడ్, శ్రీనివాస్, ప్రకాష్, మనోహర్, రాంచంద్ర రెడ్డి, కృష్ణ యాదవ్, రాము, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్, సురేష్ నాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
