📅 Friday, 06 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ప్రభుత్వ లక్ష్యాల సాధనలో నిర్మల్ జిల్లా పనితీరు మెరుగుపరచాలి.
‹
›
District News

నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు - నిబంధనల ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు - కలెక్టర్ ఇలా త్రిపాఠి*

◉ T PRAKASH RAO   |   ◷ Latest
నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు
- నిబంధనల ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు 
 -  కలెక్టర్ ఇలా త్రిపాఠి*
  • కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర నవంబర్ 06 : జిల్లాలోని వివిధ క్వారీల నుండి నిబంధనలకు అనుగుణంగానే ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతోందని, ఈ విషయంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక రీచ్ లను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని, ఇసుక రవాణా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తూచ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, జవహర్ నవోదయ విద్యాలయం భవన సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వలను నిర్దేశిత ఇసుక రీచ్ ల నుండి తరలించేందుకు అనుమతించినందున ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, మైనింగ్ అధికారి బాలు, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.