📅 Friday, 06 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో ఎమ్మెల్యే ఫండ్ ఒక్క రూపాయి కూడా కేటాయించలే
‹
›
District News

రక్షణ,ఉత్పత్తిలో మేటి కైరిగుర ఓపెన్ కాస్ట్.

◉ M VIJAYA   |   ◷ Latest
రక్షణ,ఉత్పత్తిలో మేటి కైరిగుర ఓపెన్ కాస్ట్.
  • ఏరియా జిఎం ఎం.శ్రీరమేష్.
రెబ్బెన,సాక్షర:రక్షణ,ఉత్పత్తి లో మేటి ఖైరిగుర ఉపరితల గని అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ అన్నారు.ఏరియా లోని ఖైరిగుర ఉపరితల గని 2024-25ఆర్ధిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో 5స్టార్ రేటింగ్ సాధించిన సందర్భంగా శుక్రవారం ఓసీ వద్ద సంబరాలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిఎం అధికారులు,ఉద్యోగుల కృషిని కొనియాడారు.ఇప్పటి వరకు మైన్ కు వచ్చిన పతకాలు,జ్ఞాపిక లను ప్రదర్శించారు.ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఖైరిగుర ఉపరితల గని ఉత్పత్తి పనితీరు,రక్షణ చర్యలు,నిర్వహణ సౌకర్యాలు పర్యావరణహిత చర్యలు,కార్మిక సంక్షేమం వంటి 84అంశాలలో జాతీయ స్థాయిలో ఇతర గనులతో పోటీ పడిందన్నారు.100 మార్కులకు గాను 91కి పైగా మార్కులతో 5స్టార్ రేటింగ్ సాధించడం గర్వకారణం అన్నారు.అవార్డు రావడంలో ప్రతి ఉద్యోగి కృషి ఉందన్నారు.
అనంతరం అత్యవరసర సమయంలో ఉద్యోగికి సిపిఆర్ చేసే విధానాన్ని రెస్క్యు సిబ్బంది చూపించారు.కార్యక్రమంలో ఏఐటియూసి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి,ఖైరిగుర పీఓ ఎం.నరేందర్,ఎస్ఓ టు జిఎం స్వామిరాజు,ఏరియా ఇంజనీర్ బి.వీరన్న,ప్రాజెక్ట్ మేనేజర్ జే.శంకర్ ఖైరిగూడ ఫిట్ సెక్రటరీ మారం శ్రీనివాస్,ఇంచార్జి పిఈ ఎస్.రాజు,సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేష్ రెడ్డి అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.