- నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో ఎమ్మెల్యే ఫండ్ ద్వారా నిజమాబాద్ నగర అభివృధీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ప్రస్తుతం కార్పొరేషన్ లో ఉన్న బడ్జెట్ తో పనులు ప్రారంభిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 17, 19వ డివిజన్ల లో శుక్రవారం రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్ కు 20 లక్షల కేటాయించిన విషయం తెలిసిందేనన్నారు. ఇందూరులో బీజేపీ గెలిచిందని నిధులు కేటాయించడం లేదా అని ప్రశ్నించారు. నగరంలోని అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఆ నిధులతో ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఇందూరు అభివృద్ధి పై చర్చించానన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, చింతా ప్రసూన, పసునూరి రాము, మమత శివ, మాయావార్ సాయిలు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer