పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మిక మహిళలకు దసరా కానుకలు
రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న పీఎన్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పారిశుద్ధ్య కార్మిక మహిళలకు దసరా కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం అందిస్తున్న సేవలను అభినందించారు. పండుగ వేళ కార్మిక మహిళలతో సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజానికి నిరంతరం సేవలందించే పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖదీర్, నాగేష్, కిష్టయ్యా, కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
