📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

చెన్నూరులో మెగా రక్తదాన శిబిరం 60 మంది రక్తదానం

◉ Kodishetti Sathish   |   ◷ Latest
చెన్నూరులో మెగా రక్తదాన శిబిరం 

60 మంది రక్తదానం
చెన్నూరు సాక్షర : పట్టణంలోని లయోలా స్కూల్‌లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 60 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారుఈ కార్యక్రమానికి చెన్నూరు మున్సిపల్ చైర్మన్ పెద్దింటి పద్మ, కౌన్సిలర్ కొమ్మేర విజయలక్ష్మి, లయన్స్ క్లబ్ జోన్ చైర్‌పర్సన్ జాడి తిరుపతి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ సంతోష్ కుమార్, లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మల సాగర్ హాజరయ్యారుఅలాగే లయన్స్ క్లబ్ సభ్యులు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, రక్తదాతలు పాల్గొన్నారురక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు