నూతన అగ్నిమాపక భవన కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
- శంకుస్థాపన చేయనున్న నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్
శంకుస్థాపన చేయనున్న నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
నిర్మల్ అక్టోబర్ 19(సాక్షర ప్రతినిధి)
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ కొమురం భీం చౌరస్తా వద్ద నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణానికి ఈ నెల 21న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంఛార్జి అగ్నిమాపక అధికారి మామిడి భగవాన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 21
బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నూతన అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణంతో ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొంటారని జిల్లా అగ్నిమాపక అధికారి తెలిపినారు.
