లక్ష పుష్పార్చన, శ్రీ లలితా సహస్రనామ పూజలు నిర్వహించిన ఏలేటి కవితమహేశ్వర్ రెడ్డి దంపతులు.
- నిర్మల్ జిల్లా మరియు రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం
నిర్మల్ అక్టోబర్ 17(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా మరియు రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ బీజేఎల్పీ నేత, నిర్మల్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వారి సతీమణి ఏలేటి కవితారెడ్డి లక్ష పుష్పార్చన, శ్రీ లలితా సహస్రనామ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ నిర్మల్ జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సాగు చేసిన పంటలు సమృద్ధిగా పండి మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
