పటాన్‌చెరు: పట్టణంలోని జె.పి. కాలనీలో శ్రీ బ్రహ్మంగారి దేవాలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీ బ్రహ్మంగారి కల్యాణోత్సవంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం శాంతినగర్, రామేశ్వరం బండ ప్రాంతాల్లో పర్యటించారు. ఇంద్రేశంలో నవీన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 26వసారి నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని వారితో మమేకమయ్యారు. భక్తి, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter