బిసి ఏ కులాలకు న్యాయం చేసిన తర్వాతే ముదిరాజ్ లను చేర్చండి
- రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టంగారి జీతయ్య డిమాండ్
గత 70 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న రజక ఎస్సీ రిజర్వేషన్ అమలు విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇతర కులాలను బీసీ ఏ జాబితాలో చేర్చాలని రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టంగారి జీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఏ జాబితాలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో,గంగపుత్ర వడ్డెర, వాల్మీకి బోయ వంటి ఇంకా చాలా సంచార కులాలకు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాతే ముదిరాజ్ లను బీసీ-ఏ జాబితాలో చేర్చాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద అన్ని కులాల సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉన్నాయని దాని ప్రకారం బీసీ ఏ కులాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రజక నాయకులతో పాటు బీసీ ఏ కులాల నేతలు పాల్గొన్నారు
