తపాలపూర్ గ్రామంలో కుష్టి వ్యాధి నిర్ధారణ అవగాహన కార్యక్రమం
జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో కుష్టు వ్యాది నిర్దారనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ తెలిపారు. శుక్రవారం రోజున గ్రామంలో కుష్టి వ్యాధి నిర్ధారణ మరియు అవగాహన కార్యక్రమంలో బాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తిని చర్మంపై తెలుపు ఎరుపు లేదా రాగి రంగు మచ్చలు ఉండి మచ్చలపై స్పర్శ లేకపోవడం చేతులు కాళ్లు తెమ్మిర్లు ముద్దువారిపోవడం మచ్చపై చెమట పట్టకపోవడం వెంట్రుకలు రాలిపోవడం నరాలు లావుగా అవ్వడం వంటి లక్షణాలు ఉన్నాయా లేదా గుర్తించి కుష్టి వ్యాధి పై అవగాహన కల్పించడం జరిగిందని అయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారించి ఏం డి టి మందులు ఉచితంగా ఇస్తారని ముందుగా వ్యాధిని గుర్తిస్తే, వేళ్ళు వంగిపోవడం ముక్కు చదును అవడం కాలి పుండ్లు ,అంగవైకల్యం నుండి కాపాడుకోవచ్చని ఈ ఎల్సిడిసి కార్యక్రమం 22 అక్టోబర్ నుండి 4 నవంబర్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలందరూ వైద్య సిబ్బందికి సహకరించలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త లలిత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
