📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఏం బి బి ఎస్ సాదించిన విద్యార్థికి సన్మానం
‹
›
District News

గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.
  • ప్రమాదం లో ఇద్దరు మృతి నలుగురికి గాయాలు కడ్తాల్ గ్రామా శివారులో అంబులెన్స్ ని, ఢీ కొట్టిన లారీ.........ఆదిలాబాద్ జిల్లా గాడిగూడ గ్రామానికి చెందినవారు. తల్లి కూతురు ఇద్దరు మృతి
గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదం లో ఇద్దరు మృతి నలుగురికి గాయాలు
కడ్తాల్ గ్రామా శివారులో అంబులెన్స్ ని, ఢీ కొట్టిన లారీ..........
నిర్మల్ అక్టోబర్ 22 సాక్షర ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లా గాడిగూడ గ్రామానికి చెందిన మెసరం సరస్వతి కి ఆరోగ్యం భాగలేనందున అదిలాబాద్ రిమ్స్ లో ఆడ్మిట్ చేసినారు. ఆరోగ్యం కుదుటపడకపోయే సరికి అదిలాబాద్ రిమ్స్ వారు హైదరాబాద్ కి నిమ్స్ రిఫర్ చేసినారు. వీరికి ఐ టి డి ఏ వారు అంబులెన్స్ ను ప్రొవైడ్ చేసి, అక్టోబర్ 22 రోజునా సాయంత్రం 08 గంటల ప్రాంతం లో అదిలాబాద్ రిమ్స్ నుండి బయలుదేరి వస్తున్న క్రమం లో నిర్మల్ జిల్లా,సోన్ మండల పరిధిలోని కడ్తాల్ గ్రామా శివారులో అంబులెన్స్ బీ నంబర్ AP01 TA 1330 సమయం
రాత్రి 1030 గంటల సమయం లో అంబులెన్స్ కి ఎదురుగా ఒక లారీ బి నెంబర్ TN24AX 8586 గల లారీ డ్రైవరు అతివేగంగా ,అజాగ్రత్తగా,తప్పు తోవలో అంబులెన్స్ కి డీ కొట్టగా మెసరం సరస్వతి, 22 ,మరియు మెసరం పారుబాయి ,55 ఇద్దరికీ బలమైన(వీరిద్దరూ తల్లి కూతుర్లు) గాయాలు కావడం తో వారిని ఆసుపత్రికి తరలించే క్రమం లో చనిపోయారు. అంబులెన్స్ డ్రైవరు కనక సాయికిరణ్ కి మరియు అంబులెన్సులో వున్న సరస్వతి కుటుంబ సబ్యులు అయిన కనక గీత ,తూమురం సాయిలు , మెసరం సోము కి బలమైన గాయాలు అయినవి . వారు ప్రస్తుతం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిస్తా పొందుతున్నారు.
మృతురాలి అన్న సోము దరఖాస్తు మేరకు సొన్ సబ్ ఇన్స్పెక్టర్ కే గోపి కేసు నమోదు చేసుకొని,దర్యాప్తు చేస్తునట్లు తెలపినారు.