- ఎస్ఓ టు జిఎం స్వామి రాజు.
రెబ్బెన,సాక్షర:కళకు జీవం పోసేది నిరంతర సాధన మాత్రమేనని బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జిఎం స్వామి రాజు అన్నారు. డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ 93వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా శుక్రవారం గోలేటిలోని సిఈఆర్ క్లబ్ లో నియర్ బై కల్చరల్ (సాంస్కృతిక)పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి,మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు,కళాకారులు ప్రతి రోజు కొంత సమయం సాధన చేయాలన్నారు.నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమిష్టిగా పోటీల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని అన్నారు.కార్యక్రమంలో భాగంగా నటరాజ స్వామి పూజ నిర్వహించారు.అనంతరం పాట పాడి కళాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు,ఎస్ఈ సివిల్ శ్రీధర్, డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ గౌరవ కార్యదర్శి డి.ప్రశాంత్,ఎస్టేట్ అధికారి రజినీకాంత్,ఏఐటియుసి నాయకులు రాజేష్,అశోక్ స్పోర్ట్స్ సూపర్వైసర్ అశోక్, స్పోర్ట్స్ కోఅర్దినేటర్ కిరణ్ బాబు,జనరల్ క్యాప్టెన్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER