గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు.....
- బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కమిషనర్, కలెక్టర్, అధికారులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు........ ఆలయ అర్చకులు అధికారులను సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు..........గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు
గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి బాసర లో గోదావరి నది పుష్కరాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి పుష్కర ఘాట్లను, తదితర పుష్కరాల నిర్మాణ పనుల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వేలాది మంది పుణ్యస్నానాలకు తరలివస్తారని, భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాల పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యవంతంగా చేపట్టాలని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు అంతా ఎప్పటికప్పుడు పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలని పేర్కొన్నారు. అవసరమైన మేరకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని చెప్పారు. పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందజేస్తూ ఉండాలని తెలిపారు.
పుష్కరాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం:............
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
బాసరలో గోదావరి పుష్కరాల పనులన్నీ నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చెప్పారు. పుష్కరాల పనుల వివరాలను కలెక్టర్ కమిషనర్ కు వివరించారు. వారానికి ఒకరోజు బాసరలో పుష్కర పనులపై సమీక్ష నిర్వహించడంతో పాటు, పనులకు సంబంధించి అధికారులందరికీ దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నది పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేస్తామని వివరించారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.అంతకుముందు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కమిషనర్, కలెక్టర్, అధికారులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులను సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ పరిశీలనలో ఇన్ ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ సుభాష్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
