📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు.....
‹
›
District News

అడవిని అడవిలోని జంతువుల రక్షణ వదిలి పాలపిట్టలు ఇసుక పై పడ్డ సిబ్బంది అధికారుల చేష్టలకు బలవుతున్న సామాన్య ప్రజలు

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
జన్నారం మండల కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం అటవీశాఖ మండల అధికారులు అడవిని అడవిలోని జంతువుల రక్షణను వదిలేసి పాలపిట్టలు ఇసుక పై సంపూర్ణ దృష్టి సారించి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారని మండలంలోని ప్రజలు మేధావులు అంటున్నారు. గత కొంత కాలంగా జన్నారం అటవీశాఖ సిబ్బంది చేస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవి ఆ అడవిలో అనేకరకాల జంతువులతో నిండుగా వుండేది కాని ఇప్పుడు కేవలం ప్రధాన రహదారికి ఇరువైపుల మాత్రమే అడవి కనిపిస్తుంది లోపలి వెళితే మాత్రం అంతా ఎడారే దీనికి కారణం మొత్తం అటవీశాఖ సిబ్బందే అని మండలంలో అంత ప్రచారం జరుగుతుంది. అడవిని అడవిలోని జంతువులనే రక్షించని ఈ సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లరూపాయలు ప్రజా ధనాన్ని అప్పచెప్పి ఈ ప్రాంతాన్ని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం గా ప్రకటించారు. దీనిద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపాది సౌకర్యాలతోపాటు ఏదైనా లాబాలు జరుగుతాయని అనుకుంటే పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయి. అడవిలోకి మనషులు పశువులు ఎవరు అనుమతి లేకుండా వెళ్ళకూడదు రోడ్లపై వాహనాల్లో వెళితే పర్యావరణ పన్ను పేరుతో లక్షల రూపాయలు ప్రజల వద్ద వసూళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పాలపిట్టలను ఇంతవరకు ఎవరు బందించలేదు దసరా రోజున ఆ అమ్మవారి దయతో అదృష్టం ఉన్నవారికి పాలపిట్ట దర్శనం ఇస్తుంది కాని పాలపిట్టను బందించరాదు అలా బందిస్తే చట్టరీత్య చెర్యలు తీసుకుంటాం అని అటవీశాఖ సిబ్బంది ప్రకటనలు చేస్తున్నారు. ముక్యంగా ఇసుక సమస్య ఇసుక అంటే భూగర్బశాఖ పరిదిలోనికి వస్తుంది కాని వాళ్ళు లేక రెవెన్యు సిబ్బంది పోలిస్ సిబ్బంది దీనిపై దృష్టి సారిస్తారు. కాని ఈ ప్రాంతంలో అన్ని అటవీశాఖ వారె చూస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖలవారు మండల ప్రజలపై అభిమానం ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ గృహాలు గ్రామ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నారు. కాని అటవీశాఖ సిబ్బంది మాత్రం వారికీ నచ్చిన వారికీ రొక్కం అందించిన వారికీ ఇష్టం అయినవారు ఇసుక వ్యాపారం చేసుకుంటే వారిని ఏమి అనకుండా ఒక సామాన్యుడు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొరకు ప్రజలతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు గ్రామాల అబివృద్ది పనులకొరకు ఇసుకను తెస్తే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సామాన్యులు ప్రజా ప్రతినిధులు అటవీశాఖ కు సంబంధం లేని ప్రాంతంలోని ఇసుకను తెస్తేనే కేసులు పెడుతున్నారు కాని వారిని నచ్చిన వారు పూర్తిగా అడవిలోనుండి ఇసుకను తెచ్చిన వారిని ఏమి అనడం లేదు అనే ప్రచారం జరుగుతుంది. అటవీశాఖ అధికారులు సెన్సిటివ్ జోన్ పరిదిలోనుండి ఇసుకను తీయవద్దు అని అంటున్నారు కాని ఆ పరిది ఎక్కడినుండి ఎక్కడికి అని అడిగితే సమాదానం లేదు అంటే వారి ఇష్టానుసారం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అటవీశాఖ ముక్య అధికారి కవ్వాల ప్రాంతంలోని అడవిలో కొందరు గిరిజన మహిళలతో అసబ్యంగా ప్రవర్తించారని దానికి ఆ అధికారి ఆ బాదితులకు పెద్దమొత్తంలో డబ్బులు అందజేసి క్షమాపణలు చెప్పి ఈ రహస్యాన్ని బయటకు రాకుండా చేశాడని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే రాబోయే రోజులలో ఈ ప్రాంతం అంతా అటవీశాఖ అధినంలోకి వెళ్ళే అవకాశాలు వున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలవద్ద అటవీశాఖ సిబ్బంది అనేకరకాల పేర్లతో పన్నులు వసూళ్ళు చేస్తూ ఈ ప్రాంతంనుండి ప్రజలను వలస వెళ్ళే విదంగా చేశే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి ఆంక్షలతో మండలంలో రియల్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది అంతేకాకుండా ఈ ప్రాంతంలోని ప్రజలు వారి వారి ఆస్తులను వదిలేసి వలసలు వెళ్ళు ప్రమాదం త్వరలోనే వస్తుందని మండల మేధావులు అంటున్నారు.