📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్
  • అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
పటాన్‌చెరు నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్‌చెరు పట్టణంలోని బండ్లగూడ, శ్రీరామ్ నగర్, జె.పి. కాలనీ, నర్ర బస్తీ, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. అమ్మవారి కృపాకటాక్షాలు పటాన్‌చెరు పట్టణ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.