- చల్లూరి అశోక్ ఏఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి.
రెబ్బెన,సాక్షర:యాజమాన్యమే సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జమ చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్ అధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం గోలేటిలోని బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీ రమేష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో వివిధ విభాగాల్లో సుమారు30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని,సంస్థకు వచ్చిన లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు 5వేల500 లాభాల వాటా ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించిందని సంబంధిత కాంట్రాక్టర్లు జిఎస్టి సాకు చూపి వారి వద్ద పనిచేసే కార్మికులకు వాటా చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.యాజమాన్యమే నేరుగా కార్మికులకు చెల్లించకుండా సంబంధిత కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకే మొగ్గుచూపడంతో సంబంధిత కాంట్రాక్టర్లు జిఎస్టి భారం తమపై పడుతున్న నేనెవరో నెపంతో కార్మికులకు లాభాల వాటా చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని, యాజమాన్యమే జీఎస్టీ భారం లేకుండా నేరుగా కాంట్రాక్టు కార్మికుల ఖాతాలో బోనస్ చేయాలని లేనిపక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చి కార్మికుల ఖాతాలో బోనస్ జమ చేసే విధంగా చర్యలు తీసుకొని కార్మికుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొల్పాలని ఏఐటియుసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేస్తుందన్నారు.కార్యక్రమంలో గోలేటి బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొయ్యడ సాగర్ తో పాటు అంకయ్య,బాబురావు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER