- దుర్గం రవీందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి..
రెబ్బెన,సాక్షర:కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు చేయూత,సామాజిక భద్రత పెన్షన్లు మంజూరు చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులు,ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించినట్లవుతుందని,పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా పేద,బలహీన వర్గాల ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి తోడ్పడతాయని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.గతంలో పెన్షన్ల కోసం ఎదురుచూసిన కొత్త లబ్ధిదారులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజల అభివృద్ధి,పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
— M VIJAYAREBBENA REPORTER