📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS చేయూత పెన్షన్లు మంజూరు చేయడం హర్షనీయం..
‹
›
District News

నందిపేట్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తనిఖి నిర్వాహకులకు ఆహార భద్రత అధికారి నోటీసులు

◉ T PRAKASH RAO   |   ◷ Latest
నందిపేట్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తనిఖి నిర్వాహకులకు ఆహార భద్రత అధికారి నోటీసులు
నిజామాబాద్ - సాక్షర ప్రతినిధి : నందిపేట్ లో నిజామాబాద్ ఆహార భద్రతా అధికారిని G Navitha శుక్రవారం అసిస్టెంట్ కలెక్టర్ సాయి సురేష్ ఐఎఎస్ తో కలిసి 6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖి చేసి పలు లోపాలు అవకతవకలు నిబంధనలకూ పాటించకుండా నడుపుతున్నట్లు గుర్తించారు అంతేకాకుండా సరేనా లైసెన్స్ లేకుండా వ్యాపారం, సింథటిక్ రంగుల వాడకం, మిగిలిపోయిన ఆహారాన్ని వాడటం, పరిశుభ్రత పాటించడం లేదని నిర్వాహకులను ఈ విషయమై ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై తీసుకున్న చర్యలు- లైసెన్స్ లేని 6 మందికి నోటీసులు జారీ చేయగా లోపాలు సరిచేసే వరకు వ్యాపారాన్ని మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు అలాగే తిను బండారాల్లో సింథటిక్ రంగులు, మిగిలిపోయిన ఆహారం వాడరాదని, పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు ఆదేశించినట్లు తెలిపారు ప్రజల ఆరోగ్య భద్రత ముఖ్యంగా కనీసం నిబంధనను పాటించకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తే చిటపరకారం కేసులు నమోదు చేస్తామని వారిని హెచ్చరించినట్లు నిజామాబాద్ ఆహార భద్రతా అధికారి G Navitha తెలిపారు.