శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొన్న మునిసిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి
- నేటి యువతకు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయకం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి యువతకు పిలుపునిచ్చారు
నేటి యువతకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం స్ఫూర్తిదాయకమని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని నాయుడువాడలో శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ......... ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలకు, పరిపాలనా దక్షతకు, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు, అనుసరించిన ఆదర్శాలు చిరస్మరణీయమని కొనియాడినారు. శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశభక్తి, క్రమశిక్షణ, సమాజ సేవాభావంతో ముందుకు సాగాలని యువతకు,ప్రజలకు పిలుపునిచ్చారు.
శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మహనీయుల చరిత్రను, వారి ఆదర్శాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆకారపు కేశవరాజు, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణ, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
