- యువతలోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకే ఉత్సవాలు: అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్
నిర్మల్ నవంబర్ 3(సాక్షర ప్రతినిధి) యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకే జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాథోడ్ రమేష్ అన్నారు.యువజన ఉత్సవాల్లో భాగంగా జానపద బృంద గానం, జానపద బృంద నృత్యం,నాటిక, చిత్రలేఖనం,కవితా రచన తదితర విభాగాల్లో వివిధ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాలలు,కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు,యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆయా విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించిన విజేతలు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో నిర్మల్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సేవల శాఖ అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, న్యాయ నిర్ణేతలు జోసఫ్ బాబురావు,ఎట్టెం రజిత,సౌమ్య,మధు,మెట్టు రవి, కొండూరు పోతన్న, విశ్వనాథ్ వర్మ, చెనిగారపు నాగరాజు, వేణుగోపాల్, ఎర్రన్న, రఫిక్, పేట కార్యదర్శి భూమన్న,రవీందర్,భోజన్న తదితరులు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer