- కాషాయ జెండాలతో జనసంద్రంగా మారిన పట్టణం.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో భారీ ప్రదర్శన.. పాల్గొన్న బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు
నిర్మల్ నవంబర్ 3 (సాక్షర ప్రతినిధి) నిర్మల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహా పాదయాత్రకు బీజేపీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాషాయ జెండాలు రెపరెపలాడుతుండగా పట్టణంలోని ప్రధాన వీధులు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మహా పాదయాత్ర నిర్వహించినట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సహ ఇన్‌చార్జులు అభయ్ పాటిల్, రేఖా శర్మ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలాగే ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer