ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ.. మౌలిక వసతుల కల్పనకు చర్యలు
- పాత భవనానికి మరమ్మతులు.. మార్చురీ ఏర్పాటు, నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి కృషి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఆసుపత్రి భవనం పాతదైన నేపథ్యంలో అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో మార్చురీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులతో సంప్రదించి అవసరమైన ప్రతిపాదనలు, చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీలత, సర్పంచ్ షబానా బేగం, ఇతర అధికారులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
