జన్నారం సాక్షర: జన్నారం మండలంలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో అంగరంగ వైబవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11 ఆదివారం రోజున మండలకేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో భక్తులు శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో బాగంగా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నారు. మంచి అలంకరణలతో మండపాలను ఏర్పాటుచేసి అమ్మవారి విగ్రహాలను ఏర్పరుచుకొని ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పూజలు అన్నప్రసాద వితరణ భజనలు భోనాలు కుంకుమ పూజలు హోమాలు కళ్యాణాలు తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. మంటపాల నిర్వాహకులు భక్తులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మండలకేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆలయ పురోహితులు గుండి గణేష్ శర్మ అద్వర్యంలో అమ్మవారికి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక అలంకరణలు పూజలు అర్చనలు అభిషేఖాలు ప్రత్యేక హారతి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిదంగా మహిళలు ప్రత్యేక అమ్మవారి పారాయణాలు భజనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
— Kotha VenugopalDistrict Correspondent