📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

​శ్రీ మంజునాథ సీనియర్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు ​

◉ Kodishetti Sathish   |   ◷ Latest
​శ్రీ మంజునాథ సీనియర్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు
​
చెన్నూరు (సాక్షర):
చెన్నూరు పట్టణంలోని బలిజవాడలో శ్రీ మంజునాథ సీనియర్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా కుంకుమ పూజల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు లలితా సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
​అనంతరం దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
​ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాదాసు మధుకర్, బొడ్డు రాజు కుమార్, సంతోష్, దోమకొండ అనిల్, సునీల్, రెడ్డి మహేష్, బొడ్డు సుదర్శన్, ఆల్లంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.