📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

స్వేచ్ఛా రథం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా,జిల్లా అదనపు కలెక్టర్లు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
స్వేచ్ఛా రథం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా,జిల్లా అదనపు కలెక్టర్లు
  • వెట్టి చాకిరి నిర్మూలనకు సమష్టిగా , కార్మికుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలి
నిర్మల్ అక్టోబర్ 19(సాక్షర ప్రతినిధి)
వెట్టి చాకిరి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, కార్మికుల హక్కులు, చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా వెట్టి చాకిరి నిర్మూలన, కార్మికుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.........., వెట్టి చాకిరి వల్ల కలిగే అనర్థాలు, దాని నిర్మూలనకు ఉన్న చట్టాలు, కార్మికులకు కల్పించిన హక్కులపై నాటికలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించే ఈ ప్రచార రథం ద్వారా వ్యవసాయ రంగం, ఇటుక బట్టీలు, మైనింగ్, క్వారీలతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులకు తమ హక్కులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వెట్టి చాకిరికి గురైన వారు, అలాంటి ఘటనలను గుర్తించిన వారు వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080-69434343ను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
అనంతరం వెట్టి చాకిరి నిర్మూలనకు సంబంధించిన గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెట్టి చాకిరి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, కార్మిక శాఖ అధికారి రాజలింగం, ప్రచార రథం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.