📅 Saturday, 31 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పోరాటానికి వైద్యుల మద్దతు
‹
›
District News

ఐక్యతా స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఐక్యతా స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
  • సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగించాలి – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
నిర్మల్ అక్టోబర్ 31 (సాక్షర ప్రతినిధి):
భారతదేశ సమగ్రత, సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు.
భారత తొలి ఉప ప్రధానమంత్రి, మాజీ కేంద్ర హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్మల్ కలెక్టరేట్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి దేశ సమగ్రతకు బలమైన పునాది వేశారని కొనియాడారు. ఆయన జీవితం, సేవలు, దేశం పట్ల చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పటేల్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించాలని, దేశ ఐక్యతను కాపాడటంతో పాటు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.