కాంగ్రెస్, ఇండీ కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- నవంబర్ 3న నిర్మల్లో బీజేపీ మహా పాదయాత్ర.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: మెడిసెమ్మ రాజు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడిసెమ్మ రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 3న నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఈ సందర్భంగా సోమవారం సోన్ మండలంలోని సిద్ధులకుంట, లోకల్ వెల్మల్, గాంధీనగర్, పాక్పట్ల, మాదాపూర్ గ్రామాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడిసెమ్మ రాజు మాట్లాడుతూ.. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలకు వాస్తవాలతో వివరించేందుకు ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోన్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి నాయకులు హరీష్ రెడ్డి, లింగాగౌడ్, నర్సారెడ్డి, ప్రశాంత్, రాజేశ్వర్, సాయన్న, గంగన్న, ముత్యం రెడ్డి, పోల్కం ఉదయ్, నరేందర్, వినకర్, చిన్నయ్య, ముత్యం, గోపిగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, మల్లేష్, రమేష్, సందీప్, భోజరెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణ, బాలకృష్ణ, సాయిరెడ్డి, నవీన్, గణేష్, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
