📅 Monday, 02 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
27°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS కాంగ్రెస్‌, ఇండీ కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
‹
›
District News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు 21 రోజులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు 21 రోజులు
  • బారసాల నిర్వహిస్తూ వినూత్న నిరసన.. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నిర్మల్ నవంబర్ 2 జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారంతో 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో ఉద్యోగులు వినూత్నంగా బారసాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మాట్లాడుతూ...... గత కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు