ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆయుష్ శాఖ పరిధిలో పొరుగు సేవల పద్ధతిన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 4 మెడికల్ ఆఫీసర్, 1 ఫార్మసిస్ట్, 1 సైకోసోషల్ కౌన్సిలర్ (సంవత్సరానికి కనీసం 200 సందర్శనలు), 1 యోగ ప్రొఫెషనల్, 3 మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, నేచురోపతిలో సంబంధిత విద్యార్హతతో పాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలని, ఫార్మసిస్ట్ పోస్టుకు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా-డి అర్హతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు అయి ఉండాలని, సైకోసోషల్ కౌన్సిలర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, యోగ ప్రొఫెషనల్ పోస్టుకు సంబంధిత విభాగంలో నిర్దేశిత విద్యార్హతతో పాటు నేచురోపతి, యోగిక్ సైన్సెస్‌లో డిప్లొమా అర్హత ఉండాలని, మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండి, సైకిల్ / మోటార్ సైకిల్ నడపగలగాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం వర్తించే సందర్భంలో, ఇతర అవసరమైన పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. అర్హత పరీక్షలో మార్కులు, వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని, మెరిట్ లిస్ట్ https://www.mancherial.telangana.gov.in వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 28వ తేదీన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి నిబంధనలు, అర్హతలు, రిజర్వేషన్లు, ఎంపిక విధానాన్ని పరిశీలించాలని తెలిపారు.
