📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

నిర్మల్ జిల్లా క్రీడాకారుల సత్తా.. రాష్ట్ర స్థాయి ఎంపికలకు 11 మంది!

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ జిల్లా క్రీడాకారుల సత్తా.. రాష్ట్ర స్థాయి ఎంపికలకు 11 మంది!
  • కాగజ్‌నగర్ జోనల్ పోటీల్లో ప్రతిభ చాటిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు.. విజేతలకు ప్రముఖుల అభినందనలు

నిర్మల్: కాగజ్‌నగర్‌లో నిర్వహించిన జోనల్ స్థాయి ఎంపిక పోటీల్లో నిర్మల్ జిల్లా మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో బాలబాలికలు అద్భుత ప్రదర్శనతో జిల్లా కీర్తిని చాటారు.
అండర్‌-14 బాలికల విభాగంలో మేధ శ్రీ, పెరసిస్, నూర్ సుల్తానా ఎంపిక కాగా, బాలుర విభాగంలో ఇర్ఫాన్, విక్రాంత్ రెడ్డి, విశ్వజిత్ అర్హత సాధించారు.
అండర్‌-17 బాలికల విభాగంలో నక్షత్ర, సామానవ్య రెడ్డి ఎంపిక కాగా, బాలుర విభాగంలో ఆదిత్య కృష్ణ, రిత్విక్ రాజ్, యూసఫ్ రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించారు. మొత్తంగా 11 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించడం విశేషం.ఈ పోటీల్లో కోచ్‌గా అమ్ముల భూషణ్, మేనేజర్‌గా దూసముడా చిరంజీవి బాధ్యతలు నిర్వహించారు
క్రీడాకారుల విజయంపై రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తేజేందర్ సింగ్ బాటియా, జిల్లా అధ్యక్షుడు కొండా శ్రీకాంత్, వంశీ కృష్ణ, శ్రీనివాస్, అనంతుల ప్రదీప్, ఊరే శ్రీకాంత్, మనీషా, సాయి కిరణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులతో పాటు కోచ్, మేనేజర్‌లను అభినందించి, రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.జోనల్ స్థాయి పోటీల్లో 11 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించడం మార్షల్ ఆర్ట్స్ రంగంలో నిర్మల్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.