📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం.. అన్నదానంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం.. అన్నదానంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
  • అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణ పరిధిలోని బీరంగూడ డివిజన్‌లో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం భక్తిభావంతో పాటు సేవా స్ఫూర్తిని చాటుతుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.