📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు
  • బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
  • మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్
దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుతో ఆత్మీయంగా మాట్లాడి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు చక్రపాణి, కుమార్ గౌడ్, హుస్సేన్, వెంకట్ రామ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, మహేష్, ఫయాజ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.