📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
24°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం. వారి సేవలు పోలీస్ శాఖకు ఆదర్శం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం. వారి సేవలు పోలీస్ శాఖకు ఆదర్శం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
  • పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసిన ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ అక్టోబర్ 21(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి,అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ........దేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని రక్షిస్తే, రాష్ట్రంలో అంతర్గత భద్రతను కాపాడుతూ ప్రజలకు భరోసా కల్పించేది పోలీసులని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల రక్షణలో పోలీసులు అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారని, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగానికి గుర్తుగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబాలకు అండగా నిలవడం, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం మనందరి బాధ్యత అని అన్నారు.అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి, జ్ఞాపికలను అందజేశారు. ఈ ఏడాది విధి నిర్వహణలో అమరులైన పోలీసుల పేర్లతో కూడిన రోల్ ఆఫ్ హానర్‌ను అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి చదివి వినిపించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.