ప్రతి ఒక్కరిలో భక్తి భావన వుంటే అంతా మంచే జరుగుతుంది పుర్ణచందర్ రావు
సమాజంలో ప్రతి ఒక్కరు భక్తి భావనతో వుంటే అంతా మంచే జరుగుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త మదాడి పుర్ణచందర్ రావు అన్నారు. గురువారం రోజున మండలంలోని శ్రీ దుర్గామాత మండపాలను సందర్శించిన అయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిదంగా అమ్మవారి మండపాల వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాగుణం ఓర్పు సహనం భక్తి భావనలతో ఉన్నప్పుడే ప్రతి కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని తద్వారా గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశం అంతా అబివృద్ది దిశగా వెళుతూ సంతోషంగా ఉంటారని అయన అన్నారు. అందరు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా వుండాలని అందరిపై ఆ అమ్మవారి దయ కరుణ వుండాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో అయన వెంట మండల పి సి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ సబ్యులు తదితరులు వున్నారు.
