ఇక నుండిఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లోనే. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం 2010 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ అధికారి సునీల్‌రాజ్ మాట్లాడుతూ.. చట్టంలోని ముఖ్య నిబంధనలు, వాటి అమలు విధానం, జిల్లాస్థాయిలో అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తుల నమోదు, అవసరమైన సమాచారాన్ని పొందుపరచడం, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయడం, దరఖాస్తులను పరిశీలించడం వంటి అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, కార్యక్రమ అధికారులు, ఉప జిల్లా విస్తరణ, మీడియా అధికారులు బారె రవీందర్, వెంకట్‌రెడ్డి, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సమాచార నమోదు సిబ్బంది పాల్గొన్నారు.
