విజయానికి ప్రతీకగా, ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు గురువారం హైదరాబాద్లోని మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని శ్రీ హరీష్ రావు గారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్.. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
— Vukkalkar VivekStaff Reporter