📅 Sunday, 25 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దేశంలో ఎక్కడా లేని విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
‹
›
District News

ఇక తీరనున్న నిజమాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు, ఆర్ ఓబీ నిర్మానాల పూర్తి కి నిధుల మంజూరిపై సీఎం తో TPCC అధ్యక్షుడు

◉ T PRAKASH RAO   |   ◷ Latest
ఇక తీరనున్న నిజమాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు, ఆర్ ఓబీ నిర్మానాల పూర్తి కి నిధుల మంజూరిపై సీఎం తో TPCC అధ్యక్షుడు
  • మాదవనగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులపై చర్చ* *రైల్వే బ్రిడ్జిలకు నిధుల మంజూరుకు సీఎం అంగీకారం*
సాక్షర, నిజమాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 24:
త్వరలో నిజమాబాద్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్య మైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసర మైన నిధులు త్వరగా మంజూరు చేయించడానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నడుం బిగించారు. ఈమెరకు నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా నిజమాబాద్ లోని మాదవనగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులపై,
*రైల్వే బ్రిడ్జిలకు నిధుల మంజూరుకు సీఎం అంగీకారం తెలిపినట్లు నిజమాబాద్ ప్రజలకు శుభ వార్త తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల కేటాయింపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని నేతలు వివరించారు. నేతల విజ్ఞప్తులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధుల మంజూరుకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.