- దసరా శుభాకాంక్షలు తెలిపిన బండ్లగూడ నాయకులు.. జేపీ కాలనీ డివిజన్ అభివృద్ధిపై చర్చ
బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ తన ముఖ్య కార్యకర్తలతో కలిసి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ కాలనీ డివిజన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను వివరించడంతో పాటు, వివిధ అభివృద్ధి పనులకు సహకారం అందించాలని కాటా శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. దీనిపై కాటా శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, త్వరలో ప్రోటోకాల్ పదవి వచ్చిన వెంటనే సంజీవ్ కుమార్ కోరిక మేరకు బండ్లగూడ గ్రామాన్ని సందర్శిస్తానని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలపై చర్చించి, జేపీ కాలనీ డివిజన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగమణి, భాగ్యలక్ష్మి, కుర్ర శీను, సలీం, సీతయ్య, నరసింహులు, స్వామి, లత, రమ, బాయమ్మ, అనిత, సాయి తదితరులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter