- భోగె ఉపేందర్,అంబాల ఓదెలు.
రెబ్బెన,సాక్షర:బొగ్గు రవాణా చేస్తున్న అర్హులైన డ్రైవర్లు,క్లీనర్లు కు 5వేల500 లాభాల వాటా ఇవ్వాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్,టిబిసికేఎస్ ఏరియా అధ్యక్షుడు అంబాల ఓదెలు డిమాండ్ చేశారు.శనివారం గోలేటిలోని బెల్లంపల్లి ఏరియా జిఎం కార్యాలయంలో డీజీఎం పర్సనల్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కైరిగూడా ఓపెన్ కాస్ట్ నుంచి గోలేటి సిహెచ్పి కి బొగ్గు రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లు,క్లీనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో వాటా 5500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.బొగ్గును రవాణా చేస్తూ సింగరేణి సంస్థకు,రాష్ట్ర ప్రభుత్వానికి లాభాలు రావడంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న అర్హులైన డ్రైవర్లకు,క్లీనర్లకు లాభాల బాట చెల్లించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER