జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 125 రోజుల ఉపాధి కల్పించాలి
- వీబీజీ రామ్‌జీ పథకంతో గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వీబీజీ రామ్‌జీ పథకంతో గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, అక్టోబర్ 24 (సాక్షర ప్రతినిధి): జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా 125 రోజుల ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గినప్పుడు గ్రామీణ పేద కుటుంబాలకు ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.కడెం మండలం కొండుకూరు గ్రామంలోని ఎస్కే ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన జోన్–1 స్థాయి వీబీజీ రామ్‌జీ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున, అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనుల్లో పాల్గొని పథకం ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.పథకం కింద చేపట్టే పనులకు కూలీ డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధి వంటి పనులు చేపట్టడం ద్వారా కూలీలకు ఉపాధి లభించడంతో పాటు భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
అర్హులందరికీ పథకంపై అవగాహన కల్పించాలి
ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జాబ్‌కార్డులు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి పనుల వివరాలు తెలియజేసి, వారు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రజల వద్దకే వెళ్లి పథకంపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారులు సందీప్, తుకారాంతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
