📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS బొగ్గు రవాణా చేస్తున్న డ్రైవర్లు,క్లీనర్లకు లాభాల వాటా ఇవ్వాలి.
‹
›
District News

పని చేశాం పైసలు ఇవ్వండి తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన బి ఎల్ ఓ లు

◉ Kotha Venugopal   |   ◷ Latest
పని చేశాం పైసలు ఇవ్వండి తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన బి ఎల్ ఓ లు
జన్నారం సాక్షర
ప్రభుత్వం మాకు అప్పగించిన పనిని సక్రమంగా చేశాం చేసిన పనికి మాకు పైసలు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని కోరుతూ మండల తహసిల్దార్ బక్కయ్యకు మండల బి ఎల్ ఓ లు వినతి పత్రం అందించారు. శనివారం రోజున మండలంలోని బి ఎల్ ఓ లు తహసిల్దార్ బక్కయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా బి ఎల్ ఓ లు మాట్లాడుతూ మేము ప్రభుత్వం మాకు అప్పచెప్పే ప్రతి పనిని సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తామని ప్రభుత్వం నుండి మాకు రావలసిన గౌరవవేతనం రావడంలేదని వారు అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పనులకు గాను పక్క మండలం దండెపెల్లి బి ఎల్ ఓ లకు డబ్బులు రావడం జరిగిందని మాకు ఇంతవరకు రాలేదని ఈ విషయంలో ఉన్నత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి మా డబ్బులు మాకు వచ్చేలా చూడాలని తహసిల్దార్ ద్వార ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బి ఎల్ ఓ లు డి లక్ష్మి ఎన్ రాజమణి ఎల్ పద్మ వి రమాదేవి బి విజయలక్ష్మి ఎస్ లక్ష్మి కే వాని తదితరులు పాల్గొన్నారు.